contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అసత్య ప్రచారాలపై అడిషనల్ డీసీపీకి జర్నలిస్టుల ఫిర్యాదు

గోదావరిఖని : గోదావరిఖని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు మాధవరావు, కార్యవర్గ సభ్యులపై కొంతమంది వ్యక్తులు అసత్య ప్రచారాలు చేస్తూ, తప్పుడు రాతలు రాస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రెస్‌క్లబ్ సభ్యులు అడిషనల్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. జర్నలిజంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకుంటూ ప్రెస్‌క్లబ్ ప్రతినిధులపై దుష్ప్రచారం చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి, అసత్య ప్రచారాలు మరియు బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు పోలీసు అధికారులను కోరారు. జర్నలిజం వృత్తి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.

ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు మాధవరావు మాట్లాడుతూ.. బెదిరింపులు, ఒత్తిళ్లకు తాము ఏమాత్రం భయపడబోమని స్పష్టం చేశారు. గత 40 ఏళ్లుగా జర్నలిజం రంగంలో కొనసాగుతూ ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తున్నామని తెలిపారు.

తమపై అసత్య ప్రచారాలు కొనసాగితే చట్టపరమైన మార్గంలో ముందుకు వెళ్తామని మాధవరావు స్పష్టం చేశారు. జర్నలిజం పేరును ఉపయోగించుకుని వృత్తి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రెస్‌క్లబ్ సభ్యులు కోరారు.

ఈ వ్యవహారంలో గోదావరిఖని ప్రెస్‌క్లబ్ కార్యవర్గానికి “ఇది మన హక్కు సమాచారం” పత్రిక మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :