contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎఫ్.ఏ.సి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన ఎన్. జయచంద్రన్

తిరుపతి – పాకాల: పాకాల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ (ఎఫ్.ఏ.సి)గా అదే కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఎన్. జయచంద్రన్ బాధ్యతలు స్వీకరించారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కడప వారి ఆదేశాల మేరకు మంగళవారం ఆయనను ప్రిన్సిపాల్ (ఎఫ్.ఏ.సి)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది జయచంద్రన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జయచంద్రన్ మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించడంతో పాటు విద్యాప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అధ్యాపకులు, సిబ్బంది సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు హరినాథాచారి, చంగల్‌రాజు, గీతాంజలి, రియాజ్, శారద, హరికృష్ణ, బాలకృష్ణ, గిరిజ, మోహనరంగ, శ్రీనివాసప్రసాద్, ఆనంద్, ఫరీద్, చలమారెడ్డి, సుభాషిణి, విజయనిర్మల, పద్మజతో పాటు అధ్యాపకేతర సిబ్బంది రమణమ్మ, శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :