contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రామగుండం మెడికల్ కాలేజీలో పీజీ సీట్ల విస్తరణకు చర్యలు

గోదావరిఖని : రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అనంతరం పీజీ ఉన్నత వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హిమబిందు సింగ్ తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వైద్య విద్యను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆమె పేర్కొన్నారు.

ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సహకారంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం పీజీ వైద్య విద్యకు అవసరమైన ప్రధాన విభాగాల్లో ప్రత్యేక ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు.

ప్రస్తుతం గైనకాలజీ, బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాల్లో పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు హిమబిందు సింగ్ తెలిపారు. అదేవిధంగా పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ తదితర విభాగాల్లో పీజీ విద్య ప్రారంభానికి అవసరమైన మౌలిక వసతులు, వైద్య సిబ్బంది, ఇతర ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు, వార్డులు, వైద్య పరికరాలు, మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తున్నామని ఆమె తెలిపారు. అన్ని ప్రధాన విభాగాల్లో అవసరమైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మరిన్ని విభాగాల్లో పీజీ ఉన్నత వైద్య విద్యకు అనుమతులు లభించేలా ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.

రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని హిమబిందు సింగ్ అన్నారు. పేద ప్రజలకు సాధ్యమైనంత వరకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంవోలు, వైద్య అధికారులు, సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :