చిన్న శంకరంపేట, జూన్ 3: తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు 54వ జన్మదిన వేడుకలను మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ స్వతంత్ర కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మండల కేంద్రంలో కేక్ కట్ చేసి హరీష్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి హరీష్‌రావు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వతంత్ర కుమార్ గౌడ్, మల్లుపల్లి సర్పంచ్ ఇమ్మడి నరేష్, శ్రీనివాస్ రెడ్డి, పడాల శ్రీనివాస్, హేమచందర్, బొట్టు యాదగిరి, వెంకటేష్, బాచుపల్లి యాదగిరి, తీగుళ్ల స్వామి, దయానంద్, రమేష్ నాయక్, వేణు గౌడ్, పరశురాం నాయక్, సుధాకర్ నాయక్, గొల్ల రాజు, శ్రీనివాస్ గౌడ్, అత్తిలి నాగరాజు, పోతరాజు రాజు, నవీన్, ఆకాష్, బైండ్ల రాజకుమార్, గోపాల్ నాయక్, కుమార్, శేఖర్, ఇమ్రాన్, బందెల సుధాకర్, కుమ్మరి ప్రవీణ్, కుమ్మరి రమేష్, గట్ల నరేష్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.








