కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎల్లగౌడ్ తోటలోని పద్మశాలి భవన్‌లో సాయంత్రం వేద మూర్తులైన బ్రాహ్మణోత్తములు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
పట్టణ పద్మశాలి సేవా సంఘం నూతన అధ్యక్షుడు, కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుల్లపెల్లి నాగేశ్వరరావు, వడ్నాల వెంకటనర్సయ్యలు తమ నూతన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా సంఘ పెద్దలు, ప్రముఖులు నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ సమాజ అభివృద్ధికి సేవా భావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. పద్మశాలి సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి పద్మశాలి కుల బాంధవులు, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో, ఉత్సాహభరితంగా సాగింది.








