కొమరం భీం ఆసిఫాబాద్ : అక్రమ కలప రవాణా చేస్తూ పట్టుబడి ప్రభుత్వ పరం చేయబడిన వాహనాలను ఈ నెల 30వ తేదీన బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి బాలమణి తెలిపారు.
జిల్లా అటవీ అధికారి విడుదల చేసిన ప్రకటనలో, పూర్తిగా జప్తు చేసి ఖండించబడిన వాహనాలను యథాస్థితిలోనే వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. వేలంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, టాటా ఏస్, మ్యాజిక్ వాహనాలు తదితరాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వారు జిల్లా అటవీ అధికారి, కొమరం భీం ఆసిఫాబాద్ పేరిట నిర్ణీత మొత్తానికి డిమాండ్ డ్రాఫ్ట్ చెల్లించి, జిల్లా అటవీ అధికారి కార్యాలయంలో పని వేళల్లో దరఖాస్తు ఫారాన్ని పొందాలని సూచించారు.
అలాగే, వేలంలో పాల్గొనదలచిన వారు ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు జిల్లా అటవీ అధికారి కార్యాలయంలో సంప్రదించి అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయాలని జిల్లా అటవీ అధికారి బాలమణి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఈ వేలం నిర్వహించబడుతుందని ఆమె తెలిపారు.








