పిఠాపురం : న్యాయ, ఆర్థికశాస్త్ర పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, ఎన్నో ప్రపంచ దేశాల రాజ్యాంగాల అధ్యయనశీలిగా, రాష్ట్ర కేంద్ర శాసనసభల్లో సభ్యుడిగా, వైస్రాయ్ మండలీలో సభ్యుడిగా, స్వాతంత్య్రానంతరం కేంద్ర క్యాబినెట్ మంత్రిగా, ఇంకా ప్రజా జీవితంలో వివిధ రంగాలలో సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి తన అనుభవ జ్ఞానాన్ని రంగరించి అంబేద్కర్ ఎంతో శ్రమించి మన దేశ రాజ్యాంగాన్ని రచించారని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి ఖండవల్లి లోవరాజు అన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లోవరాజు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ప్రజలందరినీ ఒకే జాతిగా తయారు చేశారని, కుల, మత ప్రాంతీయ లింగ బేధాలు లేకుండా మనుషులందరినీ ముందు నిలపాడన్నారు. 1948 నవంబర్ 5న టి.టి కృష్ణమాచారి రాజ్యాంగ రచన సంఘం పనితీరు అత్యంత కఠిన తరమైన ఈ రచనా కార్య భారాన్ని అంబేద్కర్ ఒక్కడే ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తున్నాడని కొనియాడారు. ప్రపంచంలో అతి పెద్దదైన, అతి తక్కువ రూపంలోని రాజ్యాంగం మనదని, అందులో 444 ఆర్టికల్స్, 22 భాగాలు, 12 షెడ్యూల్స్, 124 సవరణలు ఉన్నాయి. మొత్తం 1,17,369 ఇంగ్లీష్ పదాలు రాజ్యాంగ నిర్మాణ పరంగా అంబేద్కర్ రుణం తీర్చుకోలేనిది అని అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ తో సహా పలువురు మేధావులు అంబేద్కర్ ను ప్రశంసించారు. పాత సాంప్రదాయక విలువల స్థానంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం ఆయన వ్యక్తిత్వాన్ని, అనుభవాన్ని, ఆలోచననూ, దూరదృష్టినీ అడుగడుగునా భారత రాజ్యాంగం మూడు సంవత్సరాల తన జీవిత కాలాన్ని, తన ఆయుష్షును అంబేద్కర్ రాజ్యాంగం కోసం వెచ్చించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. భారతదేశ చరిత్రలోనే ఎవరు ఊహించని విధంగా రాజ్యాంగం ముందు ప్రతి భారతీయుడిని సమానం చేస్తూ, ప్రతి ఒక్కరికి సమాన సామాజిక, ఆర్ధిక ప్రజాస్వామిక, ప్రాథమిక హక్కులు ఇస్తూ వివరమైన నిబంధనలు రూపొందించిన నిజమైన స్వాతంత్ర సృష్టికర్త అంబేద్కర్ అని ఆయన అన్నారు. ఆయన అసాధారణ తరం మాత్రమే కాదు భావి తరాలూ అంబేద్కర్ పేరు భారత మిగిలిపోతుంది అంటూ భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అంబేద్కర్ ను ప్రశంసలతో ముంచెత్తారన్నారు. దిక్సూచిలా రాజ్యాంగంలో విప్లవాత్మమైన అంశాలు
ఉండేవిధంగా లౌకిక పునాదులపై అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని తయారు చేశారన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో ఫెడరలిజానికి అంబేద్కర్ పెద్దపీట వేశారని, ఫెడరలిజం ముఖ్య ధ్యేయం భిన్నత్వంలో ఏకత్వం, అధికారాల విభజన, పరిపాలన వికేంద్రీకరణ ఈ అంశాలే రాజ్యాంగ పునాదులుగా అంబేద్కర్ అభివర్ణించారన్నారు. ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రభుత్వం కాపాడడం ద్వారా మాత్రమే నిజమైన స్వాతంత్రం స్థాపించబడుతుందని ఆయన అన్నారు. ఒకవేళ రాజ్యాంగం దుర్వినియోగం అయితే దాన్ని తగలబెట్టే వాళ్లలో మొదటి వాడిని నేనే అని విప్లవాత్మకంగా, ధైర్యంగా ప్రకటించిన వ్యక్తి డా. బిఆర్ అంబేడ్కర్ అని, రాజ్యాంగంలోని 36 నుండి 51 వరకు ఉన్న 16 సూత్రాలలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారన్నారు. ఈ సూత్రాలతో పౌరుల పట్ల ప్రభుత్వం వ్యవహరించాల్సిన పద్ధతులను, ప్రభుత్వం పై రాజ్యాంగం విధించిన బాధ్యతలను ఆయన వివరించారని, వాటిని సరిగా అమలు చేయకపోతే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. రాజ్యాంగ రచనకు భారత ప్రభుత్వం ఏరి కోరి అంబేద్కర్ ను ప్రత్యేకంగా నియమించి రాజ్యాంగ రచనకు పూర్తి స్వేచ్ఛను నిచ్చిందని, రాజకీయ సమానత్వంతో బాటు సాంఘిక ఆర్ధిక సమానత్వం సాధించేలా ప్రతి మనిషికి ఒకే విలువ ఇస్తూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రతిపాదికగా భావితరాలకు లేకుండా సమాన హక్కులను, అవకాశాలను పొందడం కోసం అన్ని రకాలుగా స్వేచ్ఛను ఉండేందుకు సమాజంలోని హెచ్చుతగ్గులు, ఆర్థిక, సామాజిక అసమానతలు రూపుమాపేందుకు అంబేద్కర్ రాజ్యాంగంలోని పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుంచి 32 వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారని తెలిపారు. ఇలాంటి ఎన్నో ప్రగతిశీలమైన ప్రజాస్వామ్యబద్ధమైన అంశాలను ముందుచూపుతో రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచారని, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో, నిజాయితీతో, రాజ్యాంగాన్ని అమలు చేస్తే ప్రపంచ దేశాల్లో మన దేశం అగ్రగామి అవుతుందన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ చూపిన న్యాయపరమైన మేధస్సు, అవిశ్రాంతకృషి, సునిశిత నైపుణ్యం, స్థిరచిత్తం, అంకితభావం, ఆధునిక భావాలు, అద్భుత నైపుణ్యాన్ని చూసినాటి జాతీయ, అంతర్జాతీయ సమాజం భారత రాజ్యాంగ పితగా అయినను ఎంతో కీర్తించిందన్నారు. భారత రాజ్యాంగం రాజ్యాంగం కాదు.. అది గొప్ప చారిత్రాత్మక సామాజిక పత్రం అని గ్రాస్ విల్లీ ఆస్టిన్ లాంటి అంతర్జాతీయ రాజనీతిజ్ఞులు ఎంతోమంది అంబేద్కర్ ని ప్రశంసించారు. రాజ్యాంగ రచనలో తన పాత్రను హిందూ సమాజం అర్ధం చేసుకున్న నాడు వారికి తనపై గల అనుమానాలు మేఘాల్లా విడిపోతాయన్నారు అంబేద్కర్. నేటికీ న్యాయస్థానాలు, న్యాయ కోవిదులు, ప్రభుత్వాలు తమ ప్రశ్నలకు జవాబుల కోసం అంబేద్కర్ రచనలపై ఆధారపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తిరెడ్డి, సాకా రామక్రిష్ణ, ముక్కుడుపల్లి సూర్యచంద్ర, దడాల అజిత్, లోడ సుదర్శన్, లోవబాబు, సత్తిబాబు, శరత్ కైసేల్ తదితరులు పాల్గొన్నారు.