పిఠాపురం : చెందుర్తి గ్రామానికి చెందిన బత్తిన అప్పారావు భార్య లక్ష్మి, ఆయన పిల్లలు దుర్గాభవాని, శివన్నారాయణ, స్వర్ణాంజలి మంగళవారం ఉదయం చేబ్రోలు గ్రామంలోని నాన్న కోసం పోరాటం చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వారి తండ్రి బత్తిన అప్పారావు సెరికల్చర్ డిపార్ట్మెంట్ లో టెక్నికల్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేవాడని, గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదం జరగడంతో మతిస్థిమితం సరిగ్గా లేదన్నారు. ఇదే అదునుగా చేసుకున్న బత్తిన అప్పారావు సహోద్యోగి చింతోజుల రాజేశ్వరి, కోనేటి అప్పారావు, కోరుమిల్లి కృష్ణలు తన తండ్రికి చెడు వ్యసనాలు అలవాటు చేశారని అప్పటి నుంచి సరిగ్గా ఇంటికి రావడం లేదన్నారు. ఎందుచేత ఇంటికి రావడం లేదని ఆరా తీయగా సహోద్యోగి చింతోజుల రాజేశ్వరితో గత రెండు సంవత్సరాలుగా అక్రమ సంభదం వుందని తెలిసింది అన్నారు. దాంతో మా నాన్నని ఆరా తీయగా మీకు నచ్చిన విధంగా చేసుకోండని చెప్పారు. పిఠాపురం శాసనసభ్యుడు కొణిదల పవన్ కళ్యాణ్ తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. గుంటూరు పోలీస్ కమిషనర్ కు లెటర్ ద్వారా పంపించడం జరిగింది అన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసామని వారు ఫిర్యాదుని గొల్లప్రోలు పోలీస్ స్టేషన్కు పంపించడం జరిగిందని పోలీసులు పిలిపించి అడగ్గా అక్కడ మాకు సరైన న్యాయం జరగలేదని బాధితులు వాపోయారు. తమతల్లి లక్ష్మికి బైపాస్ అదిరి చేయించడం జరిగిందని ఆమె ఆరోగ్యం బాగోలేదని ముగ్గురు పిల్లలు చందాలు వేసుకొని జీవనం సాగిస్తున్నామన్నారు. గత సంవత్సరం పదవీ విరమణ పొందిన ఆయనకు డబ్బులు రావడంతో ఈ ముగ్గురు వ్యక్తులు డబ్బులు గురించి ఏరవేసి మా నాన్నని లొంగదీసుకున్నారని ఆమె మీడియా ఎదుట వాపోయింది. ఈ పోరాటానికి మద్దతుగా తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, జనసేన వీర మహిళా బొలిశెట్టి వెంకటలక్ష్మి మద్దతుగా నిలిచారు.