పిఠాపురం : భవిష్యత్తులో సమాజంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర వహిస్తుందని డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులు ఎండి అధికారి,వల్లూరి నానాజీ, మాగాపు గణపతి తదితరులు అన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సిపిఐ ఎంఎల్ కార్యాలయంలో ఏపీ డిజిటల్ మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ డిజిటల్ మీడియా ప్రతినిధులందరు సంఘటితంగా ఉంటే భవిష్యత్తులో మనమే సమాజంలో ప్రత్యేక పాత్ర పోషించవచ్చన్నారు. డిజిటల్ మీడియా ప్రతిరోజు అందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన సిహెచ్ రాంబాబును ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా వై.ఎన్.సి మీడియా అధినేత అధినేత మాగాపు గణపతి గౌరవ అధ్యక్షులుగాను, అధికార్ న్యూస్ అధినేత ఎండి అధికారి అధ్యక్షులుగాను, ఉపాధ్యక్షులుగా ఎన్ టైమ్స్ అధినేత వల్లూరి నానాజీ, అఖి న్యూస్ అధినేత సిహెచ్ రమ్య కార్యదర్శిగా, సి.ఆర్.బి న్యూస్ అధినేత సిహెచ్ రాంబాబు సహాయ కార్యదర్శిగా, వేగ న్యూస్ అధినేత జి శ్యాంప్రసాద్ కోశాధికారిగా, నవ్యాంధ్ర మాన్యూస్ అధినేత యు.అప్పారావు సహాయ కోశాధికారిగా, నవతా టీవి అధినేత జి.అపురూప్ పలువురు మీడియా ప్రతినిధులు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.