పిఠాపురం : కాకినాడ పట్టణంలో పిఠాపురం మహారాజా కళాశాలలో జనవరి 5 నుండి 8 వరకు నిర్వహించిన 17వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవ మహాసభలలో యువ సాహితీవేత్త, రచయిత, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ కిలారి గౌరీ నాయుడు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. యుటిఎఫ్ 50వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవ మహాసభల సందర్భంగా ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, విద్యావేత్త కె.లక్ష్మణరావు ముగింపు సభలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు భారత రాజ్యాంగంపై రచించిన విశ్లేషణాత్మక గ్రంధాన్ని గౌరీ నాయుడుకి ప్రత్యేకంగా బహుకరించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పదిహేను ఏళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల సమస్యలపై లక్ష్మణరావుతో చర్చించారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని లక్ష్మణరావు తెలిపారు. సాహిత్య, సంగీత, సాంస్కృతిక, కళా రంగాలలో కృషి చేస్తూ ఎంతోమంది యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్న గౌరీ నాయుడుని అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల పరిరక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న పోరాట యోధుడు లక్ష్మణరావు సేవలను గౌరీ నాయుడు కొనియాడారు. అలాగే గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపొందిన గోపి మూర్తిని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.