కరీంనగర్ జిల్లా:కేంద్ర హోంశాఖ సహాయక మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ని గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామస్తులు అసెంబ్లీ కన్వీనర్ ముత్యాలు జగన్ రెడ్డి సమక్షంలో కలిసి గ్రామంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరిగే పెద్దమ్మ తల్లి జాతరకు బండి సంజయ్ ని ఆహ్వానం పలికారు. అలాగే పెద్దమ్మ తల్లి దేవస్థానానికి అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా బండి సంజయ్ స్పందించారు. ఈకార్యక్రమంలో పెద్దమ్మ తల్లి జాతర కమిటీ సభ్యులు ముదిరాజు కోతి ఆంజనేయులు, చొక్కాల రాజ్ కుమార్, బొజ్జ సంతోష్, గీకుడు ఆంజనేయులు, చింతల రమేష్, జిర్ర ఆంజనేయులు, బొజ్జ శ్రీనివాస్, బొజ్జ రవీందర్, చొక్కాల అమర్, కోతి సంపత్, జిర్ర సంపత్, బొజ్జ సంపత్, చొక్కాల బాలయ్య, కోతి రమేష్, బొజ్జ కనకయ్య, జిట్టి శేఖర్, కోతి రాజేశం, కోతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
