గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల తహసీల్దార్ కార్యాలయానికి సొంత భవనం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.25 కోట్ల నిధులు మంజూరు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునీల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, తహసీల్దార్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో ప్రజలు, ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం వల్ల ఆధునిక సౌకర్యాలతో కూడిన భవనం నిర్మాణం జరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కటకం తిరుపతి, సర్పంచులు గోపాల్ రెడ్డి, కర్నే చంద్రయ్య, చొక్కారావుపల్లె ఉప సర్పంచ్ ఎం. జైపాల్ రెడ్డి, గన్నేరువరం గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్, గౌడ సంఘం మండల అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్, ఖాసీంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దం కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చిట్కురి అనంతరెడ్డి, నాయకులు న్యాత జీవన్, వరాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.








