మెదక్ జిల్లా – వెల్దుర్తి : నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ 11వ వార్షికోత్సవం మరియు నూతన గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డితో కలిసి మంత్రి ఆలయ ప్రత్యేక పూజల్లో పాల్గొని, అనంతరం నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు.
తదనంతరం శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మిరాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.








