గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఫిజికల్ సైన్స్ బోధన కోసం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయనున్నట్లు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కే. మధులత తెలిపారు.
ఈ మేరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ శనివారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై 4 నుంచి ప్రారంభమై, జూలై 6 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు.
అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీతో పాటు టెట్ (TET) అర్హతను తప్పనిసరిగా కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, సందేహాల నివృత్తి కోసం కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కే. మధులతను 8522080903 నంబర్లో సంప్రదించాలని మండల విద్యాధికారి కే. రామయ్య సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోపు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరారు.








