contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుండ్లపల్లి ఎక్స్‌రోడ్డులో విస్తృత తనిఖీలు

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: నిషేధిత గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గన్నేరువరం మండలంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శుక్రవారం గుండ్లపల్లి ఎక్స్‌రోడ్డులో ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించి అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎస్సై జి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలలో నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు జాగిలం, డాగ్ హ్యాండ్లర్ కానిస్టేబుల్ నితిన్, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, పోలీస్ కానిస్టేబుల్ సాయిప్రేమ్ పాల్గొన్నారు. కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, అనుమానిత ఇళ్లు తదితర ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్సై నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని పేర్కొన్నారు. గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు లేదా నిల్వలపై సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

ఎవరైనా వ్యక్తుల వద్ద ప్రభుత్వం నిషేధించిన గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలు ఉన్నట్లు, వాటిని విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే డయల్-100కు ఫోన్ చేసి లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన తెలిపారు.

ప్రజల భద్రత, యువత సంక్షేమం దృష్ట్యా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :