గన్నేరువరం,కరీంనగర్ జిల్లా: తెలంగాణాలో రాబోయేది బీజేపీ సర్కార్ యే నని, పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనీ చేయాలని రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం గన్నేరువరం మండలంకేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ అధ్యక్షతన జరిగిన భారతీయ జనతా పార్టీ బీజేపీ మండల కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, రాబోయే పార్టీ కార్యక్రమాలు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణ తదితర అంశాలపై ఆయన సమగ్రంగా వివరించారు. మండలంలోని పార్టీ నాయకులు సమిష్టి కృషితో పనిచేయాలన్నారు. కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతం, రాబోయే కార్యాచరణ, ప్రజా సమస్యలు, ఇతర ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, ఏలేటి చంద్రారెడ్డి,జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు మచ్చ బాలరాజు, మండల కార్యదర్శి చెక్కిళ్ల చంద్రయ్య, గన్నేరువరం 8వ వార్డు సభ్యులు మచ్చ సాయికృష్ణ, మండల కార్యవర్గ సభ్యులు సందవేణి ప్రశాంత్, కాంతాల మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








