పల్నాడు జిల్లా , కారంపూడి : కారంపూడి గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతన సర్పంచ్‌గా బాణావత్ సరస్వతి భాయ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉంటామని, ముఖ్యంగా మంచినీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తానని ప్రకటించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కూడా తెలిపారు.
తనపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పజెప్పినందుకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డికి ఎప్పుడూ రుణపడి ఉంటానని ఆమె అన్నారు. ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ, మండలంలోని నాయకులను కలుపుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పంగులూరి అంజయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం లక్ష్మీనారాయణ, చప్పిడి రాము, మునుగోటీ సత్యం, బాణావత్ బాలు నాయక్, కటికల బాలకృష్ణ, రమావత్ నాగుల్ నాయక్, తండా మస్తాన్ జానీ, గోరంట్ల నాగేశ్వరరావు, షేక్ మోదిన షా, ఎస్ పి ఆర్ కృష్ణ, నాగవరపు రాముడు, ఆశం నరసింహారెడ్డి, జక్కా వీరయ్య, మిర్యాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.