contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన కేటీఆర్‌

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే టాప్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. వరల్డ్ టాప్ 30 ఇన్‌ఫ్లూయన్సర్స్‌ లిస్ట్‌లో మన దేశం నుంచి ఇద్దరు యువ నేతలకు మాత్రమే చోటు దక్కడం విశేషం. అందులో ఒకరు మంత్రి కేటీఆర్‌ కాగా, మరొకరు ఎంపీ రాఘవ్ చద్దా.

అయితే ఈ లిస్టులో ఎంపీ కంటే మంత్రికేటీఆరే ముందు వరుసలో నిలబడి సత్తా చాటారు. అటు అఫిషియల్, ఇటు పర్సనల్ అకౌంట్.. రెండింటిలోనూ మంత్రి కేటీఆర్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ లిస్ట్‌లో కేటీఆర్‌ 12వ స్థానాన్ని దక్కించుకోగా.. రాఘవ్‌ చద్దా 23వ స్థానంలో నిలిచారు. కాగా, ఈ లిస్టులో తెలంగాణ ఐటీ శాఖకు చెందిన అఫిషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ 22వ స్థానాన్ని దక్కించుకుంది.

ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ ఐటీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ.. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటారు. మరోవైపు సమస్యల్లో ఉన్న వారికి తనవంతు సాయం చేస్తూ అండగా నిలుస్తుంటారు. ఒకవైపు రాజకీయాలు.. మరోవైపు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్‌కు చోటు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంత్రి కేటీఆర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్‌.. దావోస్ పర్యటనలో ఉన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :