మెదక్ జిల్లా – మాసాయిపేట : ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మాసాయిపేట మండల పరిధిలో వారు పలు పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మొదట రోడ్డు ప్రమాదంలో గాయపడిన నడిమితండా మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌ను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్ మనోహర్ తల్లి మృతి పట్ల ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రజాప్రతినిధులుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ మాసాయిపేట సర్పంచ్ శ్రీను, రాజిరెడ్డి సర్పంచ్, చేగుంట, మాసాయిపేట బీఆర్ఎస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








