మాసాయిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో 98 శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా “ప్రైవేట్ స్కూల్ వద్దు – ప్రభుత్వ పాఠశాలలో చేరండి” అనే నినాదంతో పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ మధుసూదన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని అవగాహన కల్పించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పదో తరగతిలో సాధించిన ఉత్తమ ఫలితాలే ప్రభుత్వ పాఠశాల విద్యా ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరన్న, కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్ధరాములు గౌడ్, గ్రామ వార్డు సభ్యులు పెరమండ్ల రమేష్, శ్రీకాంత్ యాదవ్, ఉపాధ్యాయులు రంగారెడ్డి శర్మ తదితరులు పాల్గొన్నారు.








