contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నిజామాబాద్ – వరంగల్ మధ్య కొత్త డీలక్స్ బస్సుల సేవలు ప్రారంభం

నిజామాబాద్ : ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిజామాబాద్ – వరంగల్ మార్గంలో కొత్త డీలక్స్ బస్సు సేవలను ప్రారంభించింది. నిజామాబాద్ (ఎన్‌జెడ్‌బీ) నుండి వరంగల్ (డబ్ల్యూజీఎల్) వరకు, అలాగే వరంగల్ నుండి నిజామాబాద్ వరకు మొత్తం 50 డీలక్స్ ట్రిప్పులను ప్రవేశపెట్టినట్లు నిజామాబాద్ రీజినల్ మేనేజర్ టి. జోష్ణ తెలిపారు.

ఈ బస్సులు ప్రతిరోజూ ఉదయం 3.30 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున నడుస్తాయని ఆమె వెల్లడించారు. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు ప్రత్యేక షెడ్యూల్‌ను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కొత్త సేవలతో నిజామాబాద్ – వరంగల్ మధ్య ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని సురక్షితంగా ప్రయాణించాలని రీజినల్ మేనేజర్ కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :