నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం సాంఘిక సంక్షేమ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాల బాలికల వసతి గృహలను వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహలలో బాలబాలికలకు కల్పిస్తున్న వసతి సదుపాయాలను వార్డెన్ లను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డెన్ లను సూచించారు. బాలుర వసతి గృహంలోని విద్యార్థులతో స్టడీ ప్రోగ్రెస్ గురుంచి తెలుసుకొని పరీక్ష ఫలితాలలో మెరుగైన ఫలితాలు సాదించాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖముఖి నిర్వహించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలుపుతూ దగ్గరుండి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో భోజనం మెను ని అడిగి తెలుసుకొని రోజువారీ ఫుడ్ గురుంచి వివరాలు అడిగినారు. విద్యార్థుల స్టడీ అవర్స్ లో మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని వార్డెన్ లను కోరారు. ఈ కార్యక్రమంలో శ్జిల్లా లైజినింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు, వార్డెన్స్ తదితరులు పాల్గొన్నారు.