పార్వతీపురం – కురుపాం : ప్రపంచ రక్తపోటు (బీపీ) దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కురుపాం పోలీస్ స్టేషన్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రావాడ రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ శిబిరంలో కురుపాం ఎస్‌ఐలు పి. నారాయణరావు, రమణతో పాటు పోలీస్ కానిస్టేబుళ్లు మరియు ఇతర సిబ్బందికి వైద్య బృందం బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించింది. విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొనే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్‌పీ యు. ప్రత్యూష, హెల్త్ అసిస్టెంట్ మురళీకృష్ణ, ఆశా వర్కర్లు పాల్గొని పోలీస్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పలు ఆరోగ్య సూచనలు, సలహాలు అందించారు.








