contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం

Rajasthanలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఢిల్లీకి వెళ్తున్న Rajdhani Express రైలులోని ఓ ఏసీ కోచ్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తంగా స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని అధికారులు తెలిపారు.

Thiruvananthapuram నుంచి Hazrat Nizamuddin Railway Stationకు వెళ్తున్న 12431 రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం సుమారు 5:15 గంటల సమయంలో కోటా సమీపంలోని Vikramgarh Alot Railway Station వద్ద రైలు బీ-1 ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కోచ్‌లో 68 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మంటలు చెలరేగిన వెంటనే రైల్వే సిబ్బంది స్పందించి, ప్రమాదానికి గురైన కోచ్‌ను రైలు నుంచి వేరు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ (OHE) సరఫరాను కూడా నిలిపివేశారు. ఘటన సమయంలో బోగీ నుంచి భారీగా నల్లటి పొగలు ఎగసిపడ్డాయి.

ప్రయాణికులందరినీ వెంటనే కిందకు దించి, ఇతర కోచ్‌లలోకి తరలించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోటా స్టేషన్‌లో అదనపు కోచ్‌ను జతచేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :