contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రైల్వే కోడూరు ఎంపీడీవో ఆఫీస్ వద్ద ధర్నా!

గ్రామపంచాయతీ,గ్రీన్ అంబాసిడర్ లకు,  జీతాలు చెల్లించాలని, కనీస వేతనం అమలు చేయాలని, రైల్వే కోడూరు ఎంపీడీవో ఆఫీస్ వద్ద ధర్నా!

గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ అంబాసిడర్లకు మరియు బకాయి జీతాలు వెంటనే  చెల్లించాలని, కనీస వేతనం  ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని, డిమాండ్ చేస్తూ, మంగళవారం,సీఐటీయూ అన్నమయ్య జిల్లా కార్యదర్శి సిహెచ్. చంద్రశేఖర్ ,ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు, మరియు  సిఐటియు  రైల్వే కోడూర్ మండల కన్వీనర్, దాసరి జయచంద్ర  ఆధ్వర్యంలో కార్మికులతో కలసి రైల్వే కోడూరు  ఎంపీడీవో ఆఫీస్నందు ధర్నానిర్వహించి,సీనియర్ అసిస్టెంట్ నాగరాజ్ గారికి వినతి పత్రం అందజేశారు. వారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ,పెండింగ్లో ఉన్న, ఏడాది జీతాలను తక్షణం చెల్లించాలని, కనీస వేతనం 21,000,ఇవ్వాలి.గ్రామపంచాయతీ కార్మికులకు గౌరవ హైకోర్టు 2015 వ సంవత్సరంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులకు అమలు చేస్తున్న ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ 6000 ఇవ్వాలి. 132వ జి.ఓ అమలకు 551 జీవో ఆటంకముగా ఉన్నది. దీనిని రద్దుచేసి, 132, 57 జీవోలు: ఆమలు, టెండర్లు రద్దు, రిటైర్మెంట్ టెనిఫిట్స్, బకాయి జీతాలు చెల్లింపు, పనిముట్లు, రక్షణ పరికరాలు, యూనిఫామ్, చెప్పులు, సబ్బులు, నూనెలు, టవల్స్ తదితర సమస్యలను  పరిష్కరించాలని,  గ్రామ పరిశుభ్రత ప్రజారోగ్యం పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెడుతున్నా. విష వాయువులు  పారిశుద్ధ కార్మికుల ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తున్నాయి. కరోనా మహామ్మారితో యుద్ధం చేసి ప్రజలకు ప్రభుత్వం తరపున సేవలు చేస్తున్నా.  ప్రతి నెల జీతాలు ఇవ్వడం లేదు. సుమారు 02 నుండి 06 నెలల జీతాలు: బకాయిలు ఉన్నాయి. స్వచ్చ భారత్ కార్మికులకు కుడా రెండు నుండి 11నెలలు బాకయిలు ఉన్నాయి. దీనితో కుటుంబాలు పస్తులు బతకాల్సి వస్తున్నది. గత ఆరు సంవత్సరాలుగా జీతాలు కూడా పెంచలేదు. నిత్యం పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్, కరెంటు, ఆర్టీసీ చార్జీలు, విద్యా వైద్య ఖర్చులు, ఇంటి కిరాయిలు అనేక  రేట్లు పెరిగాయి. కావున  బకాయి జీతాలు వెంటనే చెల్లించడంతోపాటు జీతాలను 21 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఏళ్లతరబడి వెట్టిచాకిరి చేస్తున్నా ప్రభుత్వాలు గోడు పట్టించుకోవడం లేదు. గ్రామపంచాయతీ కార్మికులకు గౌరవ హైకోర్టు 2015 వ సంవత్సరంలో ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కార్మికులను నిర్ధాక్షణంగా. తొలగిస్తున్నారు. వెంటనే కార్మికుల తొలగింపు నిలుపుదల చేసి గౌరవ హైకోర్టు తీర్పును అమలు చేయాలి. కనీస వేతనాలు, గుర్తింపు కార్డు, పీఎఫ్, ఈఎస్ఐ,  ప్రమాద బీమా పథకాలను అమలు చేయాలని 1999 లో జీవో ఎంఎస్ నెంబర్ 551 నీ జారీ చేశారు. 2019 ఫిబ్రవరి 8న ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 132 సహితం అమలు జరగడం లేదు. ఇస్తున్న నామమాత్రపు జీతాలు కూడా ప్రతి నెల ‘ ఇవ్వకుండా నెలల తరబడి పెండింగ్ లు పెడుతున్నారు. ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. పది రోజుల్లో చెల్లించాలని జిల్లా కలెక్టర్ చెప్పే మూడు నెలలైనా చెల్లించలేదన్నారు. కేంద్ర ఇచ్చిన 800 కోట్లను,రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘ నిధులను దారి మళ్లించి ఉందని, సర్పంచులు వీధి లైట్లు కూడా వేసుకున్న పరిస్థితి లేదని విమర్శించారు.  న్యాయమైన సమస్యలను 19.10.2022 లోపు పరిష్కరించాలి. లేని యెడల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 20.10.2022 నుండి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. బకాయి జీతాలు వెంటనే చెల్లించి కార్మికుల కుటుంబాలను పస్తుల నుండి కాపాడాలి డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు 10 లక్షలు, సాధారణంగా మృతి చెందిన కార్మి ఐదు లక్షలు, ఇల్లు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలి. ఈ కార్యక్రమంలో గంగయ్య ,సుబ్రహ్మణ్యం, పెంచలయ్య, జయరామయ్య, గంగయ్య, రంగయ్య, రమణయ్య, గంగమ్మ, జయమ్మ తిరుపాల్ ,పెంచలయ్య,వెంకట్ స్వామి, వెంకటయ్య. మొదలగు కార్మికులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :