contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాష్ట్ర డెయిరీ డెవలప్ మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గా సోమా భరత్ కుమార్ – నియామక పత్రాన్ని అందజేస్తున్న కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం సోమవారం మరో నామినేటెడ్ పదవిని భర్తీ చేసింది. తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా సోమా భరత్ కుమార్ ను నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సోమా భరత్ కుమార్ నియామక ఉత్తర్వులను అందుకున్నారు. ఈ పదవిలో భరత్ కుమార్ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవిలో నియమించిన కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో డెయిరీ రంగం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :