మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతోనే మానవ మనుగడ సాధ్యమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవ-2024 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని వైకుంఠపురం ఆర్చి రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాల్లో చెత్త కుప్పలను తొలగించి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అన్నారు. మొక్కలు నాటి వదిలేయకుండా వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు మనం మంచి వాతావారణాన్ని అందించిన వారమవుతామని అన్నారు. ఈ సందర్బంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిసిపి శ్రీనివాసులు రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.