తిరుపతి: శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో మంగళవారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి అధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీచింగ్, నాన్ టీచింగ్ విద్యార్థుల చేత రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ ప్రతి ఏటా నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామనీ, నవంబర్ 26 రాజ్యాంగం పుట్టినరోజని అన్నారు. 1949 నవంబరు 26వ తేదిన భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిందని, అయితే భారత రాజ్యాంగం మాత్రం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని భారత పార్లమెంట్ ఆమోదించబడి నేటికి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నదని అన్నారు. రాజ్యాంగం విశిష్టత గురించి, అందులోని విశేషాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వేద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రాధా గోవింద త్రిపాటి, విశ్వవిద్యాలయం డీన్లు, హెచ్ ఓ డిలు, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.