అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామం లో ఆదివారం జరిగిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ బొలికొండ రంగనాథ స్వామి రథోత్సవ కార్యక్రమానికి గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు వారి కుటుంబ సభ్యులకు ఆలయ కమిటి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మరియు కుటుంబ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి రథోత్సవం వరకు పల్లకి సేవలో పాల్గొని, కొబ్బరికాయ కొట్టి శ్రీ శ్రీ బొలికొండ రంగనాధ స్వామి రదోస్తవాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు గుత్తి మండల టిడిపి బాధ్యులు గుమ్మనూరు ఈశ్వర్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రంగస్వామి రెడ్డి యాదవ్, రామచంద్రారెడ్డి యాదవ్తొ, చిన్న రెడ్డి యాదవ్, ఈవో శోభతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు నియోజకవర్గం ప్రజలు మరియు గుత్తి పట్టణ మరియు మండల కూటమి నాయకులు కార్యకర్తలు భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








