దుబ్బాక /తూప్రాన్ డివిజన్: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 14వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి దొమ్మట భూపాల్, 18వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంకం హేమలత మధు గార్లకు మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయా వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
బీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాక పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉందని, పట్టణంలో రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కొనసాగాలంటే మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసంతో ముందుకు వస్తున్నారని, 14వ వార్డ్ అభ్యర్థి దొమ్మట భూపాల్ , 18వ వార్డ్ అభ్యర్థి అంకం హేమలత మధు గార్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.








