కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని రెవెన్యూ ఆఫీసులో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి చోక్కల శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి సోమవారం రోజు కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ప్రజావాణి లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గన్నేరువరంలో భూ సమస్యలు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. భూ భారతిలో వచ్చినటువంటి దరఖాస్తులు వెంటనే పరిష్కారం చూపాలని సిబ్బందిని నియమించి వచ్చిన సమస్యను పరిష్కారం కొరకై చొరవ చూపాలని అన్నారు. వివిధ గ్రామాలకి ఇన్చార్జి జి పి ల ను మాత్రమే నియమించారు, మండలంలో ఓక్కరే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నారని తద్వారా ఈ చివరన ఉంటే ఆ చివరికి చేరుకోలేకపోతున్నారని భూ సమస్యలు ఆలస్యం అవుతున్నాయని అన్నారు.








