- గన్నేరువరం లో రేణుక ఎల్లమ్మ తల్లి సిద్ధోగం
- మంగళవారం నాడు ఎల్లమ్మ బోనాలు
కరీంనగర్ జిల్లా : గన్నేరువరం మండల కేంద్రంలో గౌడ కుల బంధువుల ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సిద్ధోగం సందర్భంగా ఆదివారం నాడు గ్రామ దేవతలు పోచమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మ అమ్మవార్లకు బోనాలను ఘనంగా నిర్వహించారు. మహిళలందరూ ఉపవాసం ఉండి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం మహిళలు, ఆడపడుచులు గ్రామ వీధుల్లో బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరి డప్పు చప్పులతో శివశక్తుల పూనకాలతో నృత్యాలు చేస్తూ దీప, దూప నైవేద్యాలు సమర్పించి కోరిన కోరికలు తీర్చాలని అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎస్సై బుర్ర ఎల్లయ్య గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర తిరుపతి గౌడ్, గౌడ సంఘం మండల కోశాధికారి బుర్ర రాజ్ కోటి గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, మొగలిరేకులు సీరియల్ యాక్టర్ శ్రీరామోజు సుమన్ కుమార్, ఉపాధ్యక్షులు బుర్ర తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీధర్ గౌడ్, కోశాధికారి బుర్ర చిన్న మల్లేశం గౌడ్, సహాయ కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, సలహాదారులు బుర్ర రాములు గౌడ్,బుర్ర ముత్తయ్య గౌడ్, బుర్ర మల్లేశం గౌడ్, మండ దిలీప్ గౌడ్, ముత్యం అంజయ్య గౌడ్, బుర్ర అంజయ్య గౌడ్,బుర్ర మల్లయ్య గౌడ్, వగర మల్లయ్య మహిళలు, యువకులు పాల్గొన్నారు.







