contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి – ప్రభుత్వ వైద్యాధికారిణి మల్లేశ్వరి

అనంతపురం జిల్లా కనేకల్ : మండలంలోని ఎర్రగుంట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు ప్రభుత్వ వైద్యాధికారిణి మల్లేశ్వరి వడదెబ్బపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి మాట్లాడుతూ ప్రస్తుత వేసవికాలంలో ఎండ తీవ్రత, వడదెబ్బపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారిణి సూచించారు వడదెబ్బ, సన్ స్ట్రోక్ వల్ల కలిగే ప్రమాదాలను చక్కగా వివరించారు. వడదెబ్బ తగిలిన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను క్షుణ్ణంగా వివరించారు. అలాగే వేసవి కాలంలో ప్రబలే సీజనల్ డిసీజెస్ పై జాగ్రత్తగా ఉండాలన్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత అధికమవుతుందని ఆ సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండడంతో పాటు తగిన జాగ్రత్తలు కాటన్ దుస్తులు ధరించడం, ఎండ తగలకుండా టోపీలు, గొడుగులు ఉపయోగించుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటికి రాకూడదని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని,పాస్ట్ పూడ్ ఆహార పదార్థాలను పూర్తిగా నిషేధించాలన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :