కురుపాం :తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్ర నూతన కమిటీల ప్రకటనలో భాగంగా కురుపాం నియోజకవర్గానికి చెందిన వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్‌కు కీలక బాధ్యతలు లభించాయి. ఆయనను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా వీరేష్ చంద్రదేవ్ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
అధినాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నారా లోకేష్‌కు అభినందనలు
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నారా లోకేష్‌కు వీరేష్ చంద్రదేవ్ అభినందనలు తెలిపారు. యువ నాయకత్వంలో పార్టీ జాతీయ స్థాయిలో మరింత విస్తరించి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అలాగే కురుపాం నియోజకవర్గం నుంచి రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులైన బిడ్డిక పద్మావతి, బొంగు సురేష్‌లకు అభినందనలు తెలిపారు. మనమంతా కలిసికట్టుగా పనిచేసి కురుపాం అభివృద్ధి, పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.








