కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామంలో రెండు అంగన్వాడీ కేంద్రంలలో చిన్నారులకు పౌష్టిక ఆహారం యొక్క ప్రాముఖ్యత తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప సర్పంచ్ మాంకాళి ప్రభాకర్ పాల్గొని చిన్నారులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ప్రతి ఒక్క చిన్నారులు, గర్భిణీ స్త్రీలు ఆడపిల్లలు అందరికీ పౌష్టిక ఆహారం అందేలా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు బుర్ర కవిత, ఇరుకుల్ల లచ్చవ్వ, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్స్ ఆటికం రజిత, బొజ్జ సరోజన, ఆయాలు సంగీత,భూదవ్వ, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.








