మెదక్ జిల్లా – మాసాయిపేట/తూప్రాన్ : మాసాయిపేట మండలం పోతనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పేద సామాజిక వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందించిన ఇళ్లు దేవుడిచ్చిన వరంగా స్థానికులు అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో గుల్ల నాగరాజ్ – నవనీత, తలారి చెన్నయ్యా – లక్ష్మి దంపతులు తమ కొత్త ఇళ్లలో గృహప్రవేశం జరుపుకున్నారు. పోతనపల్లి ఇందిరమ్మ కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులను అభినందించారు.
కార్యక్రమానికి అంజిరెడ్డి, శ్రీకాంత్, జగన్ గౌడ్, దుర్గమ్ మల్లేష్, మహమ్మద్ అలీ హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ నాయకులు ఇంద్రసేన రెడ్డి, సిద్ది రెడ్డి, శేఖర్, దుర్గయ్య, రాంరెడ్డి కూడా పాల్గొన్నారు.
ఇక విలేజ్ సెక్రటరీ అశోక్, వార్డు సభ్యులు గుర్రము శేఖర్, చంద్రశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని, కొత్త ఇళ్లలోకి ప్రవేశించిన కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ఇళ్ల పంపిణీ ద్వారా పేదలకు స్థిర నివాసం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని, ఇలాంటి పథకాలు మరింత విస్తరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.









