కరీంనగర్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు దుర్మరణం చెందాడు. గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన కాంతాల రాజిరెడ్డి ట్రాక్టర్ ఇంజన్‌తో కరీంనగర్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో రాజిరెడ్డి ట్రాక్టర్‌పై నుంచి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఘటన విషయం తెలుసుకున్న తిమ్మాపూర్ ఎల్ఎండీ పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








