contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

స్క్రాప్‌ ముసుగులో అక్రమ దందా

మాసాయిపేట : మెదక్ జిల్లా మాసాయిపేటలో జాతీయ రహదారి పక్కన స్క్రాప్‌ దుకాణాల ముసుగులో స్టీల్‌ సలాకలను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రాత్రివేళల్లో లారీల నుంచి సలాకలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రిపోర్టర్ టీవీ  ప్రతినిధి విజయ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి,

కెమెరాకు చిక్కిన సలాకల విషయాన్ని స్థానిక ఎస్సై, రామాయంపేట సీఐ, తూప్రాన్‌ డీఎస్పీకి సమాచారం అందించడంతో చేగుంట ఎస్సై చైతన్య కుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేశారు. సలాకలను సీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

స్థల యజమాని గంగమళ్ల శివారెడ్డి ఈ అక్రమ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను స్థలాన్ని భోజనశాల కోసం అద్దెకు మాత్రమే ఇచ్చానని తెలిపారు. పోలీసులు పూర్తి వివరాల కోసం సంబంధిత వ్యాపారిని విచారిస్తున్నారు. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :