- తిరుపతిలో రూ. 1.50 కోట్ల విలువైన ఐఫోన్ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు.
- గోడకు రంధ్రం చేసి ఐఫోన్లు ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్.. 195 ఫోన్లు, 5 యాపిల్ ట్యాబ్‌లు స్వాధీనం.
- కేసును 6 రోజుల్లోనే ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులకు ఎస్పీ సుబ్బరాయుడు
తిరుపతి : తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని సోనా విజన్ మొబైల్ షోరూమ్‌లో చోటుచేసుకున్న భారీ దొంగతనం కేసును తిరుపతి పోలీసులు ఆరు రోజుల్లోనే అత్యంత ప్రతిభావంతంగా ఛేదించారు. షోరూమ్ గోడకు రంధ్రం చేసి రూ. 1.50 కోట్ల విలువైన 195 ఐఫోన్లు, 5 యాపిల్ ట్యాబ్‌లను ఎత్తుకెళ్లిన ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ప్రత్యేక పోలీస్ బృందాలు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో గాలించి ప్రధాన నిందితుడు ఆలమ్ షేక్‌తో పాటు పియార్పూర్ షేక్, తౌఫీక్ షేక్, మహమ్మద్ ఆజామత్ షేక్, అనికుల్ షేక్‌లను అదుపులోకి తీసుకున్నాయి. నిందితుల నుంచి చోరీ సొత్తుతో పాటు నేరానికి ఉపయోగించిన 2 మోటారు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాణాలకు తెగించి ఇతర రాష్ట్రాల్లో సాహసోపేతంగా కేసును ఛేదించిన పోలీస్ బృందాలను ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించారు.








