నర్సాపూర్–తూప్రాన్ డివిజన్ : మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నర్సాపూర్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశ నిర్మాణానికి అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
నవ భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని, యువతకు ఆయన ఎప్పటికీ స్ఫూర్తిదాయకుడిగా నిలుస్తారని ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత, యువతకు అవకాశాలు, దేశ అభివృద్ధి దిశగా ఆయన తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.








