గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ రేపాక బానవ్వ, ఉప సర్పంచ్ కూన సంతోష్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రేపాక బానవ్వ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు రాకపోకలకు మరింత సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇట్టం రాజు, వార్డు సభ్యులు బోయిని బాలయ్య, నక్క లావణ్య, నక్క లచ్చవ్వ, బామండ్ల మల్లేశం, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కూన చంద్రశేఖర్, రేపాక బాబు, బోయిని లస్మయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.








