contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పల్నాడు ఎస్పీ జగదీష్ ఆదహళ్లిని కలిసిన బీజేపీ నేత పోకూరి కాశీపతి

మాచర్ల: పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లిని మాచర్ల నియోజకవర్గ బీజేపీ నేత పోకూరి కాశీపతి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై ఎస్పీతో ఆయన చర్చించారు.

నియోజకవర్గంలోని శాంతిభద్రతలు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆరా తీసినట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ అందిస్తున్న సేవలపై కూడా చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.

అనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లిని పోకూరి కాశీపతి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేస్తామని కాశీపతి తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :