ఉమ్మడి కరీంనగర్ జిల్లా: అవినీతికి పాల్పడిన అధికారులు ఏసీబి దాడుల లో చిక్కుతున్నారు. వివరాలలోకి వెళ్తే సోమవారం రోజున పెద్దపల్లి లో ఎస్ఆర్ఎస్ పీ నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నరసింగరావు ను ఏసీబి అధికారులు పట్టుకున్నారు. ఒక వ్యక్తి నుంచి రూ 20,వేల లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు, ఒక బిల్లు విషయంలో ఏఈ కాంట్రాక్టర్ కు లంచం ఇవ్వాలని కోరారు. దీనితో ఆ కాంట్రాక్టర్ ఏసీబి అధికారులను ఆశ్రయించారు. కాంట్రాక్టర్ రోడ్డు పక్కనే రూ 20,000 ఏఈ కి ఇస్తుండగా అక్కడే మాటువేసి వున్న ఏసీబి డీఎస్పి రమణ మూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకొని నీటి పారుదల శాఖ ఈఈ ఆఫీసు కు తీసుక వచ్చి విచారిస్తూ రికార్డులను పరిశీలిస్తున్నారు.