ప్రకాశం జిల్లా / చీమకుర్తి : చీమకుర్తి విధ్యుత్ శాఖలో అధికారులతో పాటు సిబ్బంది స్థానికంగా ఉండడం లేదు. దీంతో విధ్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. వినియోగదారులు, రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎవరికీ కేటాయించిన స్థానాల్లో వారు సక్రమంగా విధులు నిర్వహిస్తే కరెంట్ సమస్యలు రావు. చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు, వినియోగదారులు కరెంట్ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. రోజులు తరపడిన ఆఫీసులు చుట్టూ తిరిగిన విధ్యుత్ శాఖ అధికారులుగాని, సిబ్బంది గాని అందుబాటులోకి రావడం లేదు. కనీసం ఫోన్లకు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి