అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పబ్లిక్ హెల్త్ అధికారి ఆదినారాయణ స్థానిక మున్సిపల్ కార్యాలయ డి ఈ హేమచంద్ర మురుగునీరు శుద్ధి కేంద్రము(Sewage Treatment Plant – STP)ఏర్పాటు కొరకు పట్టణంలోని పలుచోట్ల తిరిగి స్థల పరిశీలన చేసినారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణము యందు పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన వినియోగిస్తున్న నీటి సౌకర్యాలనుసారంగా డ్రైనేజీలు, వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీలు, ఇతర వర్తక సంస్థల ద్వారా డ్రైనేజీలలో కలుషితమవుతున్న నీటి వలన పట్టణ ప్రజలకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ప్రబలకుండా వార్డుల లో ప్రవహించే కాలువల ద్వారా వచ్చే నీటిని శుద్ధిచేయుటకు ప్లాంటు కు చేరే మురుగు నీటి ప్రాంతాలను గుర్తించామని తెలిపారు