పిఠాపురం : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రచయితగా పని చేస్తున్న డా. సునీల్ కుమార్ యాండ్ర కు నూతన సంవత్సరం సందర్భంగా తాను రచించిన వేశ్య కథకి ఉత్తమ రచయితగా రవీంద్ర రత్న పురస్కారం లభించింది. ఈ సందర్బంగా రచయిత డా. సునీల్ కుమార్ యాండ్ర మాట్లాడుతూ తన రచనా సరళిని గుర్తించి తనకు రవీంద్ర రత్న పురస్కారం అందజేసిన వేయి ఫౌండేషన్ చైర్మన్ జాన్ థామస్, అవార్డు కమిటీ మెంబర్ కె.ఎన్.చంద్రశేఖర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరెంతో పెంచిందని, మరెన్నో సమాజానికి ఉపయోగపడే రచనలు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పోటీలో తాను రచించిన “వేశ్య” కథ ఉత్తమ కథగా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అవార్డు అందుకున్న డా. సునీల్ కుమార్ యాండ్రకు ఉప్పెన సినీ దర్శకుడు సానా బుచ్చిబాబు, దర్శకుడు తేజ, హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరో నితిన్, హీరో కిరణ్ అబ్బవరం, జబర్థస్త్ కామెడీ షో నటులు, ఆర్.కె.క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్ చైర్మన్, డైరెక్టర్ మరియు నటుడు డా. కోమటి రామకృష్ణ, టిక్ టాక్ స్టార్ దుర్గారావు దంపతులు, కితకితలు హీరోయిన్ గీతా సింగ్, సినీ నటి రాజీ కలచర్ల, బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, పిఠాపురం నియోజవర్గం ఇంచార్జ్ ఖండవల్లి లోవరాజు, సీనియర్ జర్నలిస్టు డా. దాకే సింహాచలం, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, జనసేన నాయకుడు బి.ఎన్.రాజు, పలువురు సినీ రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, పిఠాపురం పట్టణ ప్రజలు, స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేశారు.