అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలసిన శ్రీ బోలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల ఫిబ్రవరి 11,12 కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవం నిర్వహించబడును ఈ సందర్భంగా15వ తారీఖున ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బల ప్రదర్శన కు ఆహ్వాన కరపత్రములను గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆలూరు లోని తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ పోటీలకు ఎమ్మెల్యే 1, 01016 రూపాయలు విరాళం అందజేశారు తదఅనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో రామాంజనేయులను ,ఆలయ కమిటీ వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిన్న రెడ్డి యాదవ్, డేగ మద్దిలేటి, రంగస్వామి రెడ్డియాదవ్ పార్థా స్వామి తదితరులు పాల్గొన్నారు
