అనంతపురం జిల్లా గుత్తి సిఐటి యు ఆధ్వర్యంలో 56వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక గాంధీ సర్కిల్ వద్ద జెండా ఆవిష్కరణ కామ్రేడ్ వెంకటేష్ చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సిఐటియు మండల కార్యదర్శి, అధ్యక్షులు నిర్మల, మల్లేష్ లు మాట్లాడుతూ 1970 సిఐటియు సంఘం ఏర్పడింది. నేడు 56 వ ఆవిర్భావం దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది అన్నారు. నేటి వరకు కార్మికుల హక్కులకై నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం సిఐటియు అని తెలిపారు. 1975లో వచ్చిన కార్మిక వ్యతిరేక ఎమర్జెన్సీని సిఐటియు వ్యతిరేకించిందని, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రేణుక, మురళి, డివైఎఫ్ఐ నాయకులు అశోక్, ప్రశాంత్ ,వెంకటేష్, మోహన్, శీను, తో పాటు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, ఆశ వర్కర్లు, అంగన్వాడి వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు
