- ఫలించిన నేనుసైతం పోరాటం
- అఫీషియల్ గా ఆగిన…. ఆవిష్కరణ
- సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణకు బ్రేక్
- మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ నోటీసులు
- సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు
- సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
నటుడు దివంగత కృష్ణ విగ్రహాన్ని మహబూబ్ నగర్ పట్టణంలోని డిఇఓ ఆఫీస్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేయొద్దంటూ నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేసిన న్యాయ పోరాటం ఫలించిందని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. తమ పోరాట ఫలితంగా శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయోద్దని లిఖీత పూర్వకంగా నోటీసు జారీ చేశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయద్దని ఈ సందర్భంగా కమిషనర్ ఆదేశాల్లో పేర్కొన్నారని ఆయన పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు
దేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం భేఖాతారు చేస్తూ మహబూబ్ నగర్ పట్టణంలో డిఈవో ఆఫీస్ చౌరస్తా వద్ద కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని సామాజిక కార్యకర్త దిద్ది ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. ఎట్టకేలకు శుక్రవారం మున్సిపల్ అధికారులు స్పందించి విగ్రహావిష్కరణ అడ్డుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా డిఈఓ ఆఫీస్ చౌరస్తా నుండి కృష్ణ విగ్రహాన్ని వెంటనే తొలగించే వరకు తాము న్యాయ పోరాటం కొనసాగిస్తామని ప్రవీణ్ తెలిపారు.