contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుత్తిలో నీటి కష్టాలకు చెక్.. ట్యాంకర్లతో ప్రజలకు అండగా ఎంకే చౌదరి

ఎంకే చౌదరి ప్రజా సేవలో మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో తీవ్ర నీటి కొరత నెలకొన్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సరఫరా కోసం ఆయన స్వంత నిధులతో నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు.

వేసవి తీవ్రత పెరగడంతో గుత్తి పట్టణంలోని అనేక ప్రాంతాల్లో మంచినీటి సమస్య మరింత అధికమైంది. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలోని కోట ప్రాంతంలోని 12, 13 వార్డులు అలాగే తాడిపత్రి రోడ్డులోని 16, 17, 18 వార్డుల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం పలుమార్లు రోడ్డెక్కి ధర్నాలు నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ పరిస్థితులను గుర్తించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ప్రజల కష్టాలను తీర్చేందుకు ముందుకొచ్చారు. రోజుకు సుమారు 15 నీటి ట్యాంకర్ల ద్వారా ఆయా వార్డులకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ దాదాపు రూ.5 వేల వరకు స్వంతంగా ఖర్చు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

సొంత లాభాలను పక్కనపెట్టి ప్రజా సేవను ధ్యేయంగా తీసుకుని పనిచేస్తున్న ఎంకే చౌదరిపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీటి కష్టకాలంలో అండగా నిలిచిన ఆయన సేవలను పలువురు అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :